మహబూబాబాద్ మండలం వేమునూరు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఈవో రజిత పరిశీలించారు. ధాన్యం కాంటా వేశాక నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని రైతన్నలు ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేశాక బస్తాల తూకం తక్కువగా వస్తున్నాయని అన్నదాతలు వాపోయారు.
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై అధికారిణి తనిఖీ - కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారిణి
వరిధాన్యం కొనుగోసు కేంద్రాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రాథమిక సహకార సంఘం సీఈవో రజిత తనిఖీ చేశారు. ధాన్యం తూకం వేశాక తక్కువగా వస్తున్నాయని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని మహబూబాబాద్ మండలం వేమునూరు గ్రామ రైతులు వాపోయారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో అవతవకలపై అధికారిణి తనిఖీ
నిర్వాహకులు మాత్రం తేమ కారణంగా మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో రెండు విధాలుగా తాము నష్టపోతున్నామని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న భాజపా శ్రేణులు కొనుగోలు కేంద్రానికి వచ్చి ఆరా తీశారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి, రైతులకు న్యాయం చేస్తానని రజిత హామీ ఇచ్చారు. అనంతరం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిని తొలగించారు.