పాసు పుస్తకాలు కావాలంటూ రైతుల నిరాహార దీక్ష - nirahara-deeksha
అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవిలో అన్నదాతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
![పాసు పుస్తకాలు కావాలంటూ రైతుల నిరాహార దీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3427490-thumbnail-3x2-vysh.jpg)
రైతుల నిరాహార దీక్ష
మహబూబాబాద్ జిల్లా కురవిలో పట్టాదారు పాసుపుస్తకాల పోరాట సంఘం ఆధ్వర్యంలో అర్హులైన రైతులందరూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిరసన చేపట్టి నినాదాలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను విధుల నుంచి తొలగించాలని సీపీఎం మండల కార్యదర్శి నక్క సైదులు డిమాండ్ చేశారు.
రైతుల నిరాహార దీక్ష