మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో ఓ అరుదైన ఘటన జరిగింది. విజయదశమి రోజు గ్రామసర్పంచ్ జాతీయజెండాను ఎగురవేశారు. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జాతీయజెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా కొనసాగుతుందని గ్రామస్థులు తెలిపారు.
దసరా పండుగవేళ జాతీయజెండా ఆవిష్కరణ - మహబూబాబాద్ జిల్లాలో జాతీయజెండా ఆవిష్కరణ
దసరా పండుగకు సాధారణంగా అందరు ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ అందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో జాతీయజెండాను ఎగురవేశారు. ఏటా గ్రామ సర్పంచ్ జాతీయజెండాను ఆవిష్కరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
దసరా పండుగవేళ జాతీయజెండా ఆవిష్కరణ
స్వాతంత్య్రానికి ముందు గార్ల ప్రాంతం నైజాం పాలనలో ఉండేది. అప్పట్లో మత సామరస్యానికి ప్రతీకగా అర్ధచంద్రాకార జెండాను ఆవిష్కరించి, దసరా ఉత్సవాలను ప్రారంభించేవారు. స్వాతంత్య్రం వచ్చాక 1965 నుంచి ఇప్పటి వరకు జాతీయజెండాను గ్రామసర్పంచ్ ఆవిష్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏడాదికి రెండుసార్లు జెండాను ఎగురవేస్తే, ఇక్కడ మూడు సార్లు ఆవిష్కరించడం ప్రత్యేకంగా నిలుస్తోంది.