తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సిబ్బంది బంగారు కొండలు - నిజాయితీ చాటుకున్న నర్సంపేట ఆర్టీసీ సిబ్బంది

బంగారంతో బయటకు వెళ్లాలంటేనే భయపడే ఈ కాలంలో కూడా... 75 వేల రూపాయల విలువ చేసే బంగారాన్ని బస్సులో మర్చిపోయిన ప్రయాణికుడికి తిరిగి  అప్పగించారు ఆర్టీసీ సిబ్బంది. వారి నిజాయితీకి మొచ్చుకొని ధన్యవాదాలు తెలిపాడు బాధితుడు.

gold
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

By

Published : Jan 4, 2020, 4:11 PM IST

మహబూబాబాద్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన నాగముని చారి వరంగల్ ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కాడు. నర్సంపేట రాగానే బస్సు దిగి వెళ్లిపోయాడు. కానీ వెంట తెచ్చుకున్న సంచిని మాత్రం బస్సులోనే మర్చిపోయాడు. బస్సు దిగిన కాసేపటికి సంచి గుర్తుకొచ్చి పట్టణంలోని బస్టాండులో ఫిర్యాదు చేశాడు.

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

స్పందించిన ఆర్టీసీ సిబ్బంది మహబూబాబాద్ బస్సు డిపోకి ఫోన్ చేసి విషయం తెలిపారు. బస్సు అక్కడికి చేరుకోగానే ఆర్టీసీ సిబ్బంది బస్సులోకి వెళ్లి వెతికారు. సంచిని తెరిచి చూడగా అందులో 75 వేలు రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. బాధితుడికి సమాచారం అందించి అక్కడకి రావాలని తెలిపారు. వెళ్లగానే సంచిని చూపించారు. అందులో 15 గ్రాముల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలు తనవేనని గుర్తించాడు. బాధితునికి ఆభరణాలున్న సంచి ముట్టినట్లు కాగితం రాయించుకుని ఆభరణాల సంచిని అప్పగించారు. తన సంచిని తనకు తిరిగి అప్పగించినందుకు ఆర్టీసీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు.

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details