తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త - Murder in Mahabubabad district

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ ముందే భార్యను కట్టుకున్న భర్తే గొంతు కోసి హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త

By

Published : Jul 30, 2019, 7:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తాక్యా తండాకు చెందిన సేవాతో మహబూబాబాద్ జిల్లా ధారవత్ తండాకు చెందిన బానోత్ కస్తూరికి ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోవటం వల్ల విడిపోయారు. కస్తూరి తన తల్లి గారింట్లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి మరిపెడలోని ఓ ప్రైవేటు క్లినిక్​లో స్వీపర్​గా పనిచేస్తోంది.

పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త

తన భార్యపై భర్త కసి పెంచుకున్నాడు. కస్తూరి ఎక్కడ ఉంటుందో ఆరా తీశాడు. మంగళవారం ఆసుపత్రి వద్దకు వచ్చాడు. ఆమెతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అనంతరం ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్​కి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి: రోడ్డు ప్రమాదంలో మామ అల్లుడు దుర్మరణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details