మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు పొంగిపొర్లుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగుకు వరదనీరు పోటెత్తింది. ఆనకట్ట పైనుంచి వరద నీరు పొంగి పొర్లుతుంది. భారీ వరదనీటితో అలుగు పోస్తున్న వాగును సమీప గ్రామాల ప్రజలు, ప్రయాణీకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వర్షాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వరుణుడు కరుణించటం వల్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాగు పరిధిలో ఖరీఫ్ పంటల సాగుకు ఇక సాగునీటికి ఢోకా లేదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పొంగిపొర్లుతున్న మున్నేరు వాగు - మున్నేరు వాగు
గత రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురవటం వల్ల మహబూబాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. డోర్నకల్ శివారులోని మున్నేరు వాగుకు వరద పోటెత్తటం వల్ల ఆనకట్ట పైనుంచి ప్రవాహిస్తోంది.
పొంగిపొర్లుతున్న మున్నేరు వాగు