ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 పురపాలికల్లో మొత్తం 1537 నామపత్రాలు దాఖలయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో మొత్తం 384 నామినేషన్లు రాగా... పరకాల పురపాలికలో 120, నర్సంపేట 162, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 102 మంది అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు.
మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 602 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్ పురపాలికలో 261, డోర్నకల్ 120, మరిపెడలో 94, తొర్రూరులో 127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.