మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో గల అంబేద్కర్ భవనంపై ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, ఖాళీ కవర్లు వ్యర్థాలతో నిండిపోయింది. దీన్ని గమనించిన ఎంఆర్పీఎస్, వివిధ కుల సంఘాలు ధర్నా నిర్వహించారు.
'అంబేడ్కర్ భవనంపై వ్యర్థాలు తొలగించండి' - MRPS protest news
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంపై వ్యర్థాలను తొలగించాలంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. దీనికి కారకులైన మున్సిపల్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
!['అంబేడ్కర్ భవనంపై వ్యర్థాలు తొలగించండి' MRPS protest at Mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9025069-979-9025069-1601656683625.jpg)
'అంబేడ్కర్ భవనంపై వ్యర్థాలు తొలగించండి'
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని వ్యర్థాలను ఏరుకుని వచ్చి అంబేడ్కర్ భవనంపై నిల్వ చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనికి కారకులైన మున్సిపల్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.