మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల వ్యవసాయ బావిలో చిన్నారులు మృతి చెందిన ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కురవి మండలం నల్లెల్ల గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బావ బావమరుదులు బావిలోనే జలసమాధి అయ్యారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి ఇరువురు ప్రాణాలు కోల్పోయారు.
చిన్నారుల కుటుంబానికి ఎంపీ కవిత పరామర్శ - చిన్నారుల మృతుల కుటుంబసభ్యులను ఎంపీ పరామర్శ
వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఎంపీ పరామర్శించారు. మహబూబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో కవిత పర్యటించారు.
చిన్నారుల మృతుల కుటుంబసభ్యులను ఎంపీ పరామర్శ
ఈఘటన రెండు కుటుంబాలలో విషాదం నింపింది. ఎంపీ మాలోత్ కవిత నల్లెల్ల గ్రామంలో పర్యటించి.. వారి కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి:ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం