మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం మణుగూరులో ఆమె పర్యటించారు. మహబూబాబాద్ ప్రాంత ఆడబిడ్డగా ఆదరించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెరాస సభ్యత్వాలను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదరించి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించినందుకు రుణపడి ఉంటానని మాలోత్ కవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, తెరాస పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పార్లమెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. - MP KAVITHA
నన్ను ఆడబిడ్డగా ఆదరించి ఎంపీగా గెలిపించారు. ఎమ్మెల్యేల సహకారంతో ఈ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మాలోత్ కవిత.
పార్లమెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా..