ఉద్యోగ ప్రకటనలు రావట్లేదని ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడిన తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన బోడ సునీల్‌నాయక్ కుటుంబాన్ని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మీ పరామర్శించారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అందించిన రూ.లక్ష నగదుతో పాటు ఎనిమిది క్వింటాళ్ల బియ్యాన్ని డాక్టర్ సీతామహాలక్ష్మీ అందించారు.
ఉద్యోగ ప్రకటనలకు ప్రభుత్వం సన్నద్ధం - ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వార్తలు
ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని.. యువత మనస్తాపం చెందవద్దని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి కోరారు. ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడిన బోడ సునీల్‌నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు.
సునీల్ ఎంజీఎంలో చికిత్స పొందుతుంటే తానే సొంత ఖర్చుతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించామని.. వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నా మృతి చెందడం దురదృష్టకరమని ఎంపీ మాలోతు కవిత పేర్కొన్నారు. ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని తెలిపారు. అనంతరం మాజీ ఎంపీ సీతారాంనాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు భరత్‌కుమార్‌రెడ్డి, రంగారావు, బాలాజీనాయక్, డాక్టర్ నెహ్రునాయక్, సురేందర్, రామన్ననాయక్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పోలీసు శాఖను వీడని పదోన్నతుల గందరగోళం