అత్యవసర వైద్య సేవల కోసం కేటాయించిన 108 వాహన సేవలను ప్రజలు వినియోగించుకోవాలని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కోరారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్టు ఏ స్మైల్ కార్యక్రమంలో సొంత ఖర్చులతో అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో నూతన వాహనాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు.
అంబులెన్స్ సేవలను అందరూ వినియోగించుకోవాలి: ఎంపీ కవిత - తెలంగాణ వార్తలు
అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీ మాలోతు కవిత కోరారు. మరిపెడ మండలంలో ఆమె కొనుగోలు చేసిన 108 వాహనాన్ని ప్రారంభించారు. వాహనంలోని వసతులపై ఆరా తీశారు.
అంబులెన్స్ ప్రారంభించిన ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ జిల్లా వార్తలు
అనంతరం వాహనంలో కూర్చొని అత్యవసర సమయాల్లో అందించే వైద్య సేవల తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్‌ను అందజేసినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.