ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహబూబాబాద్ ప్రాంత ప్రజల కల త్వరలోనే నెరవేరబోతోందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు జాతీయ రహదారుల్లో ఎన్.హెచ్ 30 జిల్లాలోని పలు ప్రాంతాలగుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వరకు ఏర్పాటుకానుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
త్వరలోనే జిల్లా వాసుల కల నెరవేరబోతోంది: ఎంపీ మాలోత్ కవిత - MP Maloth Kavitha distributing checks for Chief Minister's Aid funds
రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఐదు రహదారుల్లో ఎన్.హెచ్ 30 వల్ల మహబూబాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరబోతోందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ మాలోతు కవిత
మహబూబాబాద్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వరకు రూ. 2 వేల కోట్లతో 234 కి.మీల మేర నిర్మించబోయే రహదారి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 80 శాతం మందికి ఉపయోగపడుతుందని ఎంపీ కవిత తెలిపారు. ఈ రహదారి నిర్మాణపనులను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ రోడ్డును మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:'జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు'