మహబూబాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లోని నిరుపేదలకు ఎంపీ మాలోతు కవిత నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాలను అందజేశారు. కలెక్టర్ వీపీ గౌతంతో కలిసి జర్నలిస్ట్‌లకు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసరాలు అందజేసిన ఎంపీ మాలోతు కవిత - mp maloth kavitha distributed daily needs
లాక్‌డౌన్ సమయంలో ఎవరూ ఇబ్బంది పడకూడదని మహబూబాబాద్ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో ఎంపీ మాలోతు కవిత నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాలు, జర్నలిస్ట్‌లకు మాస్క్‌లు, శానిటైజర్లను అందజేశారు.
![పేదలకు నిత్యావసరాలు అందజేసిన ఎంపీ మాలోతు కవిత mp maloth kavitha distributed daily needs, masks and sanitizers at mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6737228-thumbnail-3x2-dist.jpg)
పేదలకు నిత్యావసరాలు అందజేసిన ఎంపీ మాలోతు కవిత
రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడకుండా సీఎం కేసీఆర్ కఠిన భద్రత చర్యలు తీసుకుంటున్నారని మాలోతు కవిత అన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశముందని.. ఇందుకు ప్రజలంతా సహకరించాలని ఎంపీ కోరారు.