తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీలో నాకు పీఏలు ఎవరూ లేరు: మాలోతు కవిత - Cbi arrested three people in delhi

దిల్లీలో తనకు ఎవరు పీఏలు లేరని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత స్పష్టం చేశారు. తన పేరు చెప్పి దిల్లీలో డబ్బులు వసూలు చేసిన ఘటనపై ఆమె స్పందించారు.

MP kavitha
ఎంపీ మాలోతు కవిత

By

Published : Apr 1, 2021, 8:10 PM IST

తెరాస ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ దిల్లీలో డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గుర్ని సీబీఐ అరెస్టు చేసింది. ఇంటిని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ దిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసి రూ.లక్షతో సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు.

రాజీబ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్​ కుమార్‌లను అరెస్టు చేశారు. మన్మిత్‌ సింగ్‌ లంబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు సీబీఐ దాడుల గురించి స్పందించిన ఎంపీ మాలోతు కవిత... ఈ ఘటనతో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశారు. దిల్లీలో తనకెవరూ సహాయకులు లేరన్న కవిత.. ఇంటి నిర్వాహణ కోసం కారు డ్రైవర్‌కు తాళం ఇచ్చినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 'రీ-ఇన్‌ఫెక్షన్‌'కు శాస్త్రవేత్తల నిర్వచనం ఇదే

ABOUT THE AUTHOR

...view details