మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నవీన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షటిల్ పోటీలను స్థానిక ఎంపీ కవిత ప్రారంభించారు. మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఆమె ప్రారంభించి... క్రీడాకారులతో కాసేపు షటిల్ ఆడారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.
మరిపెడలో షటిల్ పోటీలు ప్రారంభం - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో షటిల్ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పోటీలను స్థానిక ఎంపీ కవిత ప్రారంభించారు. క్రీడాకారులు రాణించాలని ఆమె ఆకాంక్షించారు.
మరిపెడలో షటిల్ పోటీలు ప్రారంభం
క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని ఆమె అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడాన్ని అభినందించారు. క్రీడాకారులు ఈ పోటీల్లో రాణించాలని కోరారు.
ఇదీ చదవండి:మారుతున్న 'తపాలా' ముఖచిత్రం