తెలంగాణ

telangana

ETV Bharat / state

తీజ్​ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే - MP and MLA

మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులగూడెం గ్రామంలో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్​తో కలిసి​ ఎంపీ మాలోత్​ కవిత శంకుస్థాపన చేశారు. అనంతరం తీజ్​ వేడుకల్లో పాల్గొన్నారు.

తీజ్​ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

By

Published : Aug 25, 2019, 3:15 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని​ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహుల గూడెం నుంచి వెంకట్రాం తండా వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్​తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం తండాలో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోధుమ నారు బుట్టలను తలపై పెట్టుకుని ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్​లు గిరిజన స్త్రీలతో కలిసి నృత్యాలు చేశారు.

తీజ్​ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details