తెలంగాణ

telangana

ETV Bharat / state

దాహం తీర్చుకునేందుకు 'వాహ్​'నర విన్యాసం - monkey trying hard to drink water

ఎండల తీవ్రతకు పశుపక్ష్యాదులు దాహార్తితో అల్లాడుతున్నాయి. మహబుబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో శనివారం ఓ కోతి... దాహం తీర్చుకునేందుకు నానా పాట్లు పడింది. ఎలాగైతేనేం నీళ్లు తాగి దప్పికను తీర్చుకుంది.

monkey trying hard to drink water at danthalapalli
దాహార్తి తీర్చుకునేందుకు 'వాహ్​'నర విన్యాసం

By

Published : May 31, 2020, 6:21 AM IST

ఎండలు మండుతున్నాయి. ప్రజలే కాదు పశుపక్ష్యాదులు దాహార్తితో అల్లాడుతున్నాయి. వాటి దాహం తీర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో శనివారం ఓ వానరం.. దప్పిక తీర్చుకునేందుకు కోతి చేష్టలు చేసింది.

మోటార్​ మెకానిక్​ దుకాణం వద్ద ఉన్న ఓ సిమెంటు తొట్టి అంచులను తన వెనుక కాళ్లతో పట్టుకుంది. అలా పట్టుకుని పూర్తిగా లోపలికి వంగి అడుగున్న ఉన్న నీళ్లను తాగి దాహం తీర్చుకుంది. ఈ దృశ్యం అక్కడ పనిచేస్తున్న కార్మికులను ఆశ్చర్యపరచింది.

ఇదీ చదవండిఃకరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!

ABOUT THE AUTHOR

...view details