మహబూబాబాద్ జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీ సత్వవతి రాఠోడ్ పెద్ద తండాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు తెరాసకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలో 5 జడ్పీటీసీలకు, 53 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు.
పెద్దతండాలో ఓటేసిన ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ - TRS
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కచ్చితంగా తెరాస విజయం సాధిస్తుంది. కేసీఆర్ తీసుకొస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి అధికారాన్ని కట్టబెడతాయి: సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ
'అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'