ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి హాజరయ్యారు. కొంతమంది చేస్తున్న దుర్మార్గపు ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
'సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి కోరారు.
'సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'
ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి పట్టభద్రులకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:ఎస్సై ఉదారత : కాళ్లు ఇచ్చి.. కన్నీళ్లు తుడిచారు..!