తెలంగాణ

telangana

ETV Bharat / state

నిస్సహాయ కుటుంబానికి ఎమ్మెల్సీ చేయూత - MLC POCHAMPALLY

నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి చేయూత అందించారు. పలు కారణాలతో ఆగిపోయిన మెడికల్​ క్రెడిట్ ప్రక్రియను అధికారులతో మాట్లాడి పూర్తి చేయించారు. ఎమ్మెల్సీ చేసిన సాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

mlc pochampally srinivas reddy
నిస్సహాయ కుటుంబానికి ఎమ్మెల్సీ చేయూత

By

Published : Apr 29, 2020, 7:05 PM IST

అత్యవసర చికిత్స కోసం వేచి చూస్తున్న మహబూబాబాద్​కు చెందిన ఓ మహిళకు ఎమ్మెల్సీ పోచంపల్లి సాయం అందించారు. గల్కి దరావత్ అనే మహిళ ఎలక్ట్రికల్ డిపార్ట్​మెంట్​లో స్వీపర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె సర్వైకల్ క్యాన్సర్​తో ఇబ్బంది పడుతున్నారు. బాధితురాలికి కీమో థెరపి రేడియేషన్ చేయించడం కోసం మెడికల్ క్రెడిట్​కు డిపార్ట్​మెంట్​లో దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల వైద్యం నిలిపివేశారు.

మీ సాయానికి మా ధన్యవాదాలు...

ఈ క్రమంలో తమ నిస్సహాయ స్థితిని వివరిస్తూ ఎమ్మెల్సీ పోచంపల్లికి ట్విట్టర్​ ద్వారా విన్నవించారు. తక్షణం స్పందించిన ఎమ్మెల్సీ... వార అభ్యర్థిన ప్రకారం డబ్బులను అధికారులతో మాట్లాడి మెడికల్ క్రెడిట్ చేయించారు. సకాలంలో స్పందించి సహాయం చేసినందుకు ఎమ్మెల్సీ పోచంపల్లికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చూడండి:వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details