తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల సమ్మె అందరికీ ఓ పాఠం' - ts rtc strike in mahabubabad

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రజలందరికీ ఓ పాఠం నేర్పుతుందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరాన్ని  సందర్శించి సంఘీభావం తెలిపారు.

'ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలకు ఓ పాఠం'

By

Published : Nov 19, 2019, 6:08 PM IST

మహబూబాబాద్​ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 46వ రోజు కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్న పాలకులు... నేడు కార్మికుల సమస్యలపై సీతకన్ను వేశారని ఆయన ఆరోపించారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 32 జడ్పీ ఛైర్మన్​లు ఉన్నా, నాలుగేళ్ల తర్వాత మనుగడ ప్రశ్నార్థకమేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

'ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలకు ఓ పాఠం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details