స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొదటగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శిబిరాల నుండి ఏసీ బస్సులలో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,సర్పంచ్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డిలు, పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఓటింగ్ సరళిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
మహబూబాబాద్‌లో ప్రశాంతంగా పోలింగ్ - undefined
మహబూబాబాద్ జిల్లా కేంద్రలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.
మహబూబాబాద్‌లో ప్రశాంతంగా పోలింగ్