తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలలో తెదేపాపై అభిమానం చెక్కు చెదర్లేదు' - మహబూబూబాద్​లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ

సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల ఆశ చూపి 6 సంవత్సరాలు గడిచినా తుపాకి రాముడి మాటలుగానే ఉన్నాయని వరంగల్​ ఎమ్మెల్సీ అభ్యర్థి పాడుపెళ్లి సురేశ్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు సమావేశ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

mlc election pre meeting in mahabubabad
'ప్రజలలో తెదేపాపై అభిమానం చెక్కు చెదర్లేదు'

By

Published : Oct 1, 2020, 10:30 AM IST

ప్రజలలో తెదేపాపై అభిమానం చెక్కు చెదర్లేదని, క్యాడర్ కూడా బలంగానే ఉందని వరంగల్​ ఎమ్మెల్సీ అభ్యర్ధి పాడుపెళ్లి సురేశ్​ పేర్కొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెెళ్లి.. వారిని చైతన్యం చేయాలని, పట్టభధ్రులందరిని ఓటర్లుగా నమోదు చేయాలని కార్యకర్తలను కోరారు. నిరుద్యోగులు గతంలో కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయారని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా పార్లమెంట్ ఇంఛార్జ్ కొండపల్లి రామచందర్ రావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తెరాస కార్పొరేటర్లలో ఆ 15 శాతం మంది ఎవరో అనే గుబులు!

ABOUT THE AUTHOR

...view details