కరోనాతో రాష్ట్రం రూ.54 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినా రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను సీఎం కేసీఆర్ కొనసాగించారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానం, ఎన్టీఆర్ స్టేడియంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని సూచించారు.
పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలి: ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానం, ఎన్టీఆర్ స్టేడియంలో ఉదయపు నడకకు వచ్చిన వారితో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
mlc-election-campaign-by-mlc-shankar-naik-in-mahabubabad-district
నల్గొండ-ఖమ్మం-వరంగల్ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఫరీద్, పట్టణ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జీ మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వనదుర్గమ్మా.. వసతులు లేవమ్మా!