బుధవారం రాత్రి నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి మున్నేరు, పాకాల, వట్టి, ఆకేరు, పాలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కేసముద్రం నుంచి గుడూరు, గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ వర్షానికి మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ జలమయమైన గుళ్లకుంట, గోపాలపురం, అనంతారం తదితర కాలనీలలో పర్యటించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.