మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ పాత్ర మరిచిపోలేనిదని, తెలంగాణవాదాన్ని గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపింపజేసి.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.
ప్రొ.జయశంకర్కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే - prof. Jayashankar
జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారని..పల్లెపల్లెకు తెలంగాణ వాదాన్ని వ్యాపింపజేసిన వ్యక్తుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారని ఎమ్మెల్యే అన్నారు.
ప్రొ. జయశంకర్కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
అనంతరం తెరాసలో చేరిన వివిధ పార్టీలకు చెందిన 50మంది కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తోటి సహచరుడు... దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం ఎంతో బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్టీ కార్యకర్తలతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం