ఆరున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తెరాస ఎంతో అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్‌లో జరిగిన తెరాస మహబూబాబాద్ పట్టణ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు.
మహబూబాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని, పార్టీని ప్రేమించాలని కార్యకర్తలకు ఉద్బోధ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.