ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, కేసముద్రం మండల కేంద్రాల్లో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
'ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు' - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.
!['ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారు' MLA Shankar Nayak distributing Kalyana Lakshmi checks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8783693-976-8783693-1599979563895.jpg)
మొదట నెల్లికుదురు మండల కేంద్రంలో 43 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం కేసముద్రం మండల కేంద్రంలో 16 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రోడ్డుప్రమాదంలో మరణించిన తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన కాలేరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తెరాస పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. సగం పానకమే స్వీకరించే నరసింహ స్వామి !