పేద వాడి కోసమే తెలంగాణ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యం బారిన పడిన 21 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెక్కుల పంపిణీ వార్తలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యం బారిన పడిన 21 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ పోతుంటే కొంతమంది ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ పోతుంటే కొంతమంది ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ విమర్శించారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోందని.. మనకు ఏం కాదని నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. వేడి నీళ్లు తాగుతూ, ఆవిరి పట్టుకోవాలని కోరారు.