తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్​ నాయక్ - చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

బడుగు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు.

MLA Shankar Nayak distributes CM assistance fund checks in mahaboobabad dist
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్​ నాయక్

By

Published : Dec 2, 2020, 5:30 PM IST

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే శంకర్ నాయక్​ అందజేశారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఐదుగురికి రూ.లక్షా 24 వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ప్రకారం ఎటువంటి లక్షణాలు లేకున్నా కరోనా సోకుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ అంజనీకుమార్​

ABOUT THE AUTHOR

...view details