మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో కౌన్సిలర్ మార్నేని వెంకన్నతో కలిసి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 100 మందికి నిత్యావసరాలు అందించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన శంకర్‌నాయక్ - ఎమ్మెల్యే శంకర్‌నాయక్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
![నిత్యావసరాలు పంపిణీ చేసిన శంకర్‌నాయక్ mla Shankar Nayak distributed the essentials to the poor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7078434-355-7078434-1588745346599.jpg)
నిత్యావసరాలు పంపిణీ చేసిన శంకర్‌నాయక్
లాక్డౌన్ వల్ల రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా పంటలను కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిసేంత వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీచూడండి: వలస వ్యథలు.. కూలీల తిరుగుప్రయాణం వెనుక కన్నీళ్లెన్నో..