రైతులు, పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... 18 మంది అర్హులకు ... రూ. 6 లక్షల 13 వేల.... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ - mahabubabad district latest news
సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతికి నిరంతరంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అర్హులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కరోనా వైరస్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ... కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...