ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో మహిళలకు ఆయన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
'చేనేత కార్మికులకు ఉపాధి కోసమే బతుకమ్మ చీరలు'
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసమే బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు.
'చేనేత కార్మికులకు ఉపాధి కోసమే బతుకమ్మ చీరలు'
గత పాలకులు, ప్రభుత్వాలు 24 గంటల కరెంటు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తెరాస నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :కంబాలపల్లిలో ఉద్రిక్తం... మహిళ ఆత్మహత్యాయత్నం