తెలంగాణ

telangana

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన శంకర్ నాయక్

By

Published : Apr 11, 2020, 3:47 PM IST

పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలంలో రెండు గ్రామాల్లో మక్కలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

mla shankar naik inaugurated Grain buying centers at chinna mupparam and yerrabelli gudem villages at mahabubabad
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్నముప్పారం, ఎర్రబెల్లి గూడెం గ్రామాలలో మక్కలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్​ నిర్వాహకులు ఇచ్చే టోకెన్​ల ద్వారా రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్​ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు భూక్యా బాలాజీ, జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details