రంజాన్ పండుగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్డౌన్ వేళ ఉపాధి లేక రంజాన్ పండుగను జరుపుకోవడం కష్టంగా ఉన్న తరుణంలో వారికి ఈ వస్తువులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే - MLA Shankar Naik Distributes essential goods
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తెరాస ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిత్యావసర వస్తువుల పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.