వానరానికి గుర్తుతెలియని వ్యక్తులు ఉరివేసి... చెట్టుకు వేలాడదీసిన ఘటనను చూసి ఎమ్మెల్యే శంకర్ నాయక్(MLA Shankar naik) చలించిపోయారు. వెంటనే వాహనం దిగి... వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు శివారులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
MLA Shankar naik: చెట్టుకు ఉరివేసిన వానరాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ జిల్లా కాచికల్లు శివారులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు వానరాన్ని చెట్టుకు ఉరివేశారు. ఇది చూసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్(MLA Shankar naik) చలించిపోయారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్, వానరానికి అంత్యక్రియలు
ఎమ్మెల్యే శంకర్ నాయక్ నెల్లికుదురు మండల కేంద్రంలో బతకమ్మ చీరలను(bathukamma sarees distribution 2021) పంపిణీ చేసి వరంగల్‌కు వెళ్తుండగా... కాచికల్లు శివారులో చెట్టుకు వేలాడుతున్న వానరం మృతదేహాన్ని చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి, జేసీబీతో గుంతను తవ్వించి... వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి:msp for kharif crops 2021: మార్కెటింగ్ సీజన్‌పై సర్కార్ స్పెషల్ ఫోకస్.. మద్దతు ధరలు ఇవే!
Last Updated : Oct 2, 2021, 5:02 PM IST