సినీనటుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌తో పాటు కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంక్ (Chiru Oxygen bank)ను ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ (Mla sahnkar naik) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కరోనా రెండో దశలో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని… విజ్ఞప్తిని మన్నించి వెనుకబడిన గిరిజన జిల్లాకు మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ (Chiru Oxygen bank)ను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Chiru Oxygen Bank: చిరు ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు... ఎమ్మెల్యే కృతజ్ఞతలు - Mahabubabad chiranjeevi oxygen bank
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ (Chiru Oxygen bank)ను ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. కరోనా రెండో దశలో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని… వెనుకబడిన గిరిజన జిల్లాకు మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ (Chiru Oxygen bank)ను ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

chiru
ఈ బ్యాంక్ లో 24 గంటల పాటు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయని… ప్రభుత్వ హాస్పిటల్లో గాని, నిరుపేదలకు గాని అవసరమైన వారు ఉచితంగా ఈ ఆక్సిజన్ సిలిండర్లలను తీసుకువెళ్లవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. చిరంజీవి అభిమానులు ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.