నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ, చీమ్లాతండా, బంగ్యాతండాలో పర్యటించిన ఎమ్మెల్యే... రూ. 5 కోట్లతో నిర్మించనున్న 80 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
'నిరుపేదల సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యం' - mla redyanayak visit
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ, చీమ్లాతండా, బంగ్యాతండాలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పర్యటించారు. రూ. 5 కోట్లతో నిర్మించనున్న 80 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
!['నిరుపేదల సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యం' mla redyanayak started double bed roon houses in kuravi mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8598568-338-8598568-1598663283468.jpg)
mla redyanayak started double bed roon houses in kuravi mandal
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.