తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - paddy buying center started at marripeda

మహబూబాబాద్​ జిల్లా మరిపెడలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, కురవి మండలం సీరోలులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు.

మహబూబాబాద్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

By

Published : Nov 25, 2019, 7:42 PM IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. మహబూబాబాద్​ జిల్లా మరిపెడలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, కురవి మండలం సీరోలులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వం ఇస్తున్న మద్ధతు ధరలకు ధాన్యాన్ని అమ్మి లబ్ధి పొందాలన్నారు. అనంతరం మరిపెడ మండలం బీచ్‌రాజుపల్లి చెరువుకు చేరిన ఎస్సారెస్పీ జలాలకు ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.

మహబూబాబాద్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఇదీ చదవండిః 'రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజను కొంటాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details