తెలంగాణ

telangana

ETV Bharat / state

'నియంత్రిత పంటలు సాగు చేసి లాభం పొందండి' - ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వార్తలు

ఉపాధిహామీలో భాగంగా హరితహారం మొక్కల పెంపకంపై ఎమ్మెల్యే రెడ్యానాయక్​ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దంతాలపల్లిలో నిర్వహించి సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని... రైతులు నియంత్రిత పంటలు సాగు చేయాలని సూచించారు.

mla-redya-nayak-serious-on-haritha-haram-in-employment-scheme-at-mahaboobabad
'నియంత్రిత పంటలు సాగు చేసి లాభం పొందండి'

By

Published : Jun 11, 2020, 12:01 PM IST

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలోని మండల పరిషత్​ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖ అధికారులు తెలిపిన వివరాలు తెసుకున్నారు. ఇరిగేషన్, ఉపాధి హామీ అంశాల గురించి అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.

ఉపాధి హామీలో భాగంగా హరితహారం మొక్కల పెంపకంపై ఎమ్మెల్యే అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులు నియంత్రిత పంటలు సాగు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు.

ఇవీ చూడండి:గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్‌ విజృంభణ!

ABOUT THE AUTHOR

...view details