మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో తెరాస పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న ఎమ్మెల్యే... నియోజకవర్గంలో శాసనసభ్యుడే పార్టీ అధినేతగా అభివర్ణించారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆరోపణతో కురవి మండల తెరాస అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డిని పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సత్యవతి వర్సెస్ రెడ్యా.. పార్టీ మండలాధ్యక్షుడి సస్పెన్షన్ - mla redyanayak comments on party leaders
పార్టీలో వర్గాలు లేవని.. అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి సత్యవతి రాఠోడ్... అందర్నీ కలుపుకుని పోవాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆరోపణతో కురవి మండల తెరాస పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డిని సస్పెండ్ చేశారు.

'పార్టీలో వర్గాలు లేవు... అందరూ కలిసి పనిచేయాలి'
పార్టీ బలోపేతానికి వేణుగోపాల్‌రెడ్డికి అవకాశం కల్పించినప్పటికీ వినియోగించుకోలేదని వివరించారు. రెండు, మూడు రోజుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు కొత్తవారిని నియమించనున్నట్లు తెలిపారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా సీఎం కేసీఆర్.. సత్యవతి రాఠోడ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి అందరిని కలుపుకుని పని చేయాలన్నారు. పార్టీలో వర్గాలు లేవని.. అందరూ కలిసి పని చేయాలని ఎమ్మెల్యే కోరారు.