తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మల్యే రెడ్యానాయక్' - MLA Redya nayak laid the foundation for grama panchayathi office

మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

రూ.40 లక్షలతో ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

By

Published : Nov 15, 2019, 9:53 AM IST

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలో 16 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించే శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రూ.40 లక్షలతో ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
ఇవీ చూడండి : తెలంగాణ ఆర్టీసీ సమ్మె - 42వ రోజు

ABOUT THE AUTHOR

...view details