తెలంగాణ

telangana

ETV Bharat / state

లబ్ధిదారులకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ చెక్కుల పంపిణీ - mahabubabad news

ఆడపిల్లల పెళ్లిల్లు తల్లిదండ్రులకు భారం కాకుడదనే సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలను ప్రవేశపెట్టారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని పేర్కొన్నారు.

mla redya nayak distributed checks at mahabubabad
లబ్ధిదారులకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ చెక్కుల పంపిణీ

By

Published : Apr 4, 2021, 10:52 AM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్... లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేలా ప్రభుత్వం చేయూతనిస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 207 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు.

పేద కుటుంబాలు ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి... సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటిలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు.

ఇదీ చూడండి:ప్రాణాలను హరిస్తోన్న పుష్కరఘాట్లు.. కనిపించని రక్షణ చర్యలు

ABOUT THE AUTHOR

...view details