మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో 117 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను డోర్నకల్ ఎమ్మల్యే రెడ్యానాయక్ పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.
'పేదలకు వరం కల్యాణలక్ష్మి పథకం' - MLA Redya naik Kalyanalakshmi checks were distributed to 117 beneficiaries
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 117మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి పథకం
పేదకుటుంబాల్లోని ఆడపడుచులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలోని లేని విధంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.