మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయపురం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ప్రారంభించారు.
'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలి' - mla redya naik inaugrated grain purchase center
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో యాసంగిలో వరి సాగు గణనీయంగా పెరిగిందని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేటప్పుడు రైతులు, అధికారులు భౌతిక దూరం పాటించాలని రెడ్యా నాయక్ సూచించారు.