చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలోనే చెరువులు, కుంటలు నింపి రైతులకు సాగునీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారంలోని బండారు చెరువులో నిండిన కాళేశ్వరం జలాలకు ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.
'చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం' - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద ముప్పారంలోని బండారు చెరువులోని కాళేశ్వరం నీటికి ఆయన జల పూజలు నిర్వహించారు.
'నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం'
డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు కన్న కలలు సాకారం అయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం జలాలు అందించారన్నారు. కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..