నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పిలుపునిచ్చారు. విజయంపై అతి నమ్మకానికి పోవద్దని సూచించారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో సమావేశంలో పాల్గొన్నారు.
'ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస విజయంపై అతి నమ్మకం వద్దు' - Mahabubabad District Latest News
ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. ఫిబ్రవరి 10నాటికి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ అమలు చేస్తుందని పేర్కొన్నారు. మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్
ఏ ఎన్నికలు జరిగినా డోర్నకల్ నియోజకవర్గంలో తెరాసదే గెలుపని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లను కార్యకర్తలు కలిసి ప్రభుత్వ పథకాలు వివరించాలని సూచించారు.
ఫిబ్రవరి10 నాటికి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీని అమలు చేస్తుంది. అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. రానున్న ఎన్నికలో అధిక మెజారిటీతో గెలిపించాలి.
-రెడ్యా నాయక్, ఎమ్మెల్యే
ఇదీ చూడండి:తెరాసకు మేమే ప్రత్యామ్నాయం : మంద కృష్ణ మాదిగ