మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లిలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. టోకెన్ల ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రాలకు రావాలన్నారు. గుంపులుగా ఉండొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లిలో నెలకొల్పిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. రైతులు గుంపులుగా ఉండొద్దని సూచిస్తూ పలువురికి మాస్కులను పంపిణీ చేశారు.
మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావుల విజితతోపాటు పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'త్వరలో ఆన్లైన్లో ఫిట్నెస్ శిక్షణ తరగతులు'