మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో తెరాస జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎస్సారెస్పీ కాలువ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.227 కోట్లు మంజూరు చేసిందన్నారు. దసరా నాటికి గోదావరి జలాలు తీసుకువచ్చి నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యలు తీర్చనున్నన్నట్లు హామీ ఇచ్చారు.
గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేస్తా: రెడ్యానాయక్ - Mla-ennikala-pracharam in Mahabubabad district
ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో అభ్యర్థుల తరఫున తెరాస ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఎస్సారెస్పీ జలాలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేస్తా: రెడ్యానాయక్